కాసేపటి క్రితమే… రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వై.సి.పి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడబోమని చెప్పారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తోపాటు టిడిపి నేతలు నాకు మద్దతు ఇచ్చి ధైర్యం చెప్పారని.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే అరెస్టు చేశారని..దాడి జరిగిన సమయంలో పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని చెప్పారు. దాడి జరిగిన సమయంలో దాదాపు ఏడు ఎనిమిది గంటలు నేను కారు నుంచి బయటకు రాలేదన్నారు.. రాష్ట్రంలో న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని ధర్మాన్ని కాపాడుతున్నాయని..మైనింగ్ ప్రాంతంలో జరిగే అక్రమాలను ప్రశ్నిస్తుంటే దాడులు చేయడమే కాదు.. తప్పుడు కేసులు పెడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.