వైసీపీ, టీడీపీ మధ్య కొండపల్లి మైనింగ్ సెగలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొండపల్లి కొండను తవ్వింది ఎవరు? తవ్వుకుని లాభపడింది ఎవరు? కొండ కరుగుతున్న సమయంలో రాజకీయ సెగ ఎందుకు రాజుకుంది? పైచెయ్యి సాధించాలనే ఎత్తులు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయా? మాటలతో ఒకరు.. సాంకేతిక అంశాలతో ఇంకొకరు.. ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే వ్యూహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
కొండపల్లి కొండ మైనింగ్‌పై రగడ!
Also Read
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా వైసీపీ, టీడీపీ మధ్య కస్సుబస్సులు కామన్. దీనికంతటికీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమాలే కారణం. గతంలో నందిగామ కేంద్రంగా జరిగే వ్యవహారాలు ఇప్పుడు మైలవరానికి షిఫ్ట్ అయ్యాయి తప్ప.. మిగతాదంతా సేమ్ టు సేమ్. తాజాగా వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవటానికి ప్రధాన కారణం కొండపల్లి క్వారీయింగ్. టీడీపీ హయాంలో అక్రమంగా తవ్వేశారంటే.. కాదు వైసీపీ హయాంలోనే తవ్వేశారని పరస్పరం ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడది మరింత పీక్‌కు వెళ్లింది.
ఉమా వైఖరిపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం?
ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తోన్న వైసీపీ
గత ప్రభుత్వ హయాంలోనూ కొండపల్లిలో మైనింగ్ జరిగింది. ఆ అంశంపైనే వైసీపీ సర్కార్ ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వయంగా వచ్చి క్రషర్లు ప్రారంభించారు. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. టీడీపీకి చెందిన కొందరు నాయకులకు కూడా ఇక్కడ మైనింగ్ ఉంది. రెవెన్యూ భూమి కావడంతో మైనింగ్ చేస్తున్నామంటున్నారు టీడీపీ నాయకులు. దేవినేని ఉమా ఎందుకు అటవీ భూమిగా ఆరోపిస్తున్నారో తెలియడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అధికారపార్టీని ప్రశ్నిస్తున్న టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ఈ వీడియోలను, ఫొటోలను అస్త్రాలుగా సంధిస్తోంది వైసీపీ.
ఉమాను కార్నర్ చేయడానికి వైసీపీ గట్టి హోంవర్క్!
కొండపల్లి క్వారీయింగ్‌లో రెండు ప్రభుత్వాల హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరిగిందనే వాదన ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఒకసారి 10 లక్షల ఫైన్ వేశారు. 8 జేసీబీలు, 7 టిప్పర్లను సీజ్ చేశారు. అయితే గత ఐదేళ్లకాలంలో అటవీ భూముల్లో జరిగిన మైనింగ్‌కు వైసీపీయే కారణమన్న ఉమా ఆరోపణలకు చెక్ పెట్టడానికి అధికారపార్టీ గట్టి హోంవర్క్ చేస్తోందట.
గూగుల్ చిత్రాలే అస్త్రాలు!
2014 నుంచి 2019 వరకు వివాదాలకు కేంద్రంగా ఉన్న 143, 26/1 సర్వే నంబర్లలో జరిగిన తవ్వకాలపై గూగుల్ మ్యాపింగ్‌ను వైసీపీ బయటకు తీసింది. ఏటా ఆ సర్వే నంబరులో జరిగిన మార్పులను ప్రజల ముందు పెడుతోంది. వైసీపీ హయాంలో నిబంధనలకు మించి జరిగిన మైనింగ్‌పై ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నారు. అందువల్ల గూగుల్ చిత్రాల ఆధారంగా.. సాంకేతిక అంశాలను ఒడిసిపట్టి మాజీ మంత్రి ఉమాపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో కొండపల్లి మైనింగ్ ప్రాంతానికి వెళ్లి వేరే కేసులో ఇరుక్కున్న ఉమాను.. ఈ విషయంలో పక్కగా కార్నర్ చేయబోతోంది. మరి.. ఈ రగడ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!