జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. మున్సిపల్ ఆఫీసులోనే నిద్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హీట్ పెంచుతోంది పొలిటికల్ ఫైట్… మరోసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిగా మారింది పరిస్థితి… ప్రతీ విషయంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య యుద్ధమే నడుస్తుండగా.. తాజాగా.. మరో వివాదం చోటు చేసుకుంది.. ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి వెళ్లారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… ఇదే సమయంలో మున్సిపల్ అధికారులను, సిబ్బందిని తీసుకుని నగరంలో పర్యటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. దీంతో.. అధికారులు, సిబ్బంది అంతా ఎమ్మెల్యేతో పాటు వెళ్లిపోయారు.
మరోవైపు మధ్యాహ్నం వరకు సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంపై మండిపడుతున్న జేసీ… తమ మున్సిపాలిటీ అధికారులు కనిపించడం లేదని ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సమీక్ష సమావేశానికి అధికారులు రాకపోవడంపై గుర్రుగా ఉన్న ఆయన.. ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయంలోనే అధికారుల రాక కోసం వేచి చూస్తున్నారు.. అధికారులు రాకపోవడంతో రాత్రి కూడా మున్సిపల్ ఆఫీసులనే పడుకోవడానికి సిద్ధం అవుతున్నారు.. అధికారులు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెబుతున్నారు జేసీ.. మొత్తంగా మరోసారి తాడిపత్రి రాజకీయం చర్చగా మారింది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!