తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. జమ్మలమడుగు నియోజక వర్గం టీడీపి ఇన్‌చార్జీగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని నియమించాలని ఈ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. అదే విధంగా బద్వేల్ ఉప ఎన్నికపై కూడా భేటీలో చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ను మళ్లీ పోటీ చేయించే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించారు. ఇక ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రను బాబు అభినందించారు. జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా సమర్థవంతంగా పనిచేయాలని పార్టీ నేతలకు బాబు పిలుపునిచ్చారు.
Read: ఆ నాలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు…