టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తన స్టైల్ లో స్పందించారు. బుచ్చయ్య రాజీనామా వ్యవహారంతో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయంటూ ఆయన పేర్కొన్నారు. “‘బుచ్చయ్య రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని పొరపాటు చేశారని తప్పు బట్టానని చెప్పారు. అలా నిలదీసినందుకు బాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదట. ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్…
తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి…
మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు.. మా ప్రభుత్వం వస్తే.. కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష…
కుప్పంలో వైసీపీ నేతలు ఏం చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనట. ఒక పథకంతో రెండు ప్రయోజనాలను పొందే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. దానిపైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుప్పంలో నాడు-నేడు పథకానికి ప్రాధాన్యం టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. వరసగా ఏడుసార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది కుప్పమే. ఆ ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్…
ఏపీ గవర్నరును కలిశారు టీడీపీ నేతలు. జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది. రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు…
తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది. కొన్నాళ్ల క్రితమే..…
గోరంట్ల బుచ్చయ్య చౌదరి బెదిరించారా? బ్లాక్మెయిల్ చేశారా? అవమానాలకు, అప్రాధాన్యతలకు అలక బూనారా? అధిష్ఠానం మెడలు వంచడానికి రాజీనామా డ్రామా ఆడారా? లేక నిజంగానే బైబై చెప్పేయాలని నిర్ణయించుకున్నారా? ఇది టీకప్పులో తుఫానా? ఉప్పెన అవుతుందా? బుచ్చయ్యకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదా? టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో అలజడి రేపారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీలో చిన్న అన్నగా గుర్తింపు పొందిన ఆయన చంద్రబాబుకంటే టీడీపీలో సీనియర్. అయినప్పటికీ పదవుల…
తాడేపల్లి : టీడీపీ పార్టీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధాన వనరు అని సీఎం వైఎస్ జగన్ భావించారని..అంబేడ్కర్ బాటలో సీఎం జగన్ నడుస్తూ పాఠశాలను తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో స్కూల్స్ బాగాలేదని వార్తలు రాస్తున్నారని… దశల వారీగా స్కూల్స్ అభివృద్ది చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదా ? అని నిలదీశారు. ఆ స్కూల్స్ దుస్థితికి చంద్రబాబు కారణం కదా…? పక్కనే ఉన్న ఆ స్కూల్స్…
నిన్నటి నుంచి ఏపీ టీడీపీ పార్టీలో ముసలం నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ నిర్వహణలోనే లోపాలున్నాయని, పార్టీలో ప్రస్తుతం నేను ఒంటరివాడిని అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీకి రాజీనామాపై త్వరలోనే తన నిర్ణయం చెబుతానని కూడా అన్నారాయన. దీంతో పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు… టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, జవహర్…
అమరావతి : జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ ఎస్సీ నేతలతో చంద్రబాబు సమావేశo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీల్లో యువ నాయకత్వం రావాలని… వైసీపీ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్ ఎస్సీలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని… అధికారంలోకి వచ్చాక నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన వర్గాలపైనే జగన్ దాడులు చేయిస్తూ.. వారిపై అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. జగన్ రెడ్డి విధ్వంసకర పాలన పట్ల…