ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇవాళ చంద్రబాబు ఇంటి దగ్గర ఘటనపై లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షనేత ఇంటిపైకి ఎమ్మెల్యేను పంపి… సీఎం జగన్ తన స్థాయిని దిగజార్చుకున్నాడని… దీన్ని బట్టి ఆయన ఎంత వణికిపోతున్నాడోనని లోకేష్ పేర్కొన్నారు. “జగన్ వి గాలి హామీలు అని తేలిపోయాయి. ముద్దులు పిడిగుద్దుల్లా పడుతున్నాయి. జగన్‌ది అంతా నాటకమనీ జనానికి తెలిసిపోయింది. జనం తిరగబడే రోజు దగ్గరపడిందని, ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి వాళ్లనీ,వీళ్లనీ పంపడం ఎందుకు? నువ్వే ఓ సారి వచ్చిపోకూడదు. మా పెద్దాయన నీలాంటి క్రూర, నేరస్వభావం ఉన్నోడు కాదు. నువ్వు ముంచేయాలని నిత్యం తపించే కరకట్ట పక్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి..బొత్తిగా నీకు తెలియని అభివృద్ధి అంటే ఏంటి? కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలి?ఉపాధి-ఉద్యోగావకాశాలు ఎలా పెంపొందించాలి?అనే అంశాలు చక్కగా వివరిస్తారు. కాదూ-కూడదు ఇలాగే బ్లేడ్ బ్లాచ్‌లను వేసుకొచ్చేస్తానంటే, నీ సరదాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కళ్ళకి వడ్డీతో సహా వడ్డిస్తాం” అంటూ ఎద్దేవా చేశారు లోకేష్.