సీఎం జగన్ వైపు కన్నెత్తి చూసినా.. లోకేష్ తాట తీస్తామని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. ఒక అడుగు వేస్తే తాటి మట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని… ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని… ఇటువంటి వ్యక్తులను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడా ? అని నిలదీశారు. చంద్రబాబుకు నిరసన చెప్పటానికి వెళితే నా పై దాడి చేశారని… చంద్రబాబు నోటిని ఫినాయిల్ తో కడగాలని నిప్పులు చెరిగారు. పద్ధతి మార్చుకోకపోతే చంద్రబాబును రాష్ట్రంలో తిరుగనివ్వమని హెచ్చరించారు జోగి రమేష్.