అయ్యన్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడిక్కించాయి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు.. సీఎం వైఎస్ జగన్, వైసీపీ సర్కార్, కొందరు మంత్రులను, డీజీపీని టార్గెట్ చేస్తూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడుతోంది.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు యత్నించాయి.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, అయ్యన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరం అన్నారు.. ఆయన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. అయ్యన్న ఎమ్మేల్యే పదవి పీకేసారు.. మంత్రి పదవి పీకేసారు… చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పీకేసారు… లోకేష్ జెండా పదివి పీకేసారు… ఇంకా ఎమి పీకాలి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రోజా..
మరోవైపు.. కోడెల శివప్రసాద్‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకూండా చంద్రబాబు నాయుడు మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యాడని ప్రశ్నించారు రోజా.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైఎస్ జగన్‌ని చూసి నేర్చుకోవాని సూచించిన ఆమె.. సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మాలన్న ప్రతిపాదనలపై స్పందిస్తూ.. సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సీఎం జగన్ అమలుకు పూనుకుంటున్నారని తెలిపారు. కాగా, అయ్యన్నపాత్రుడు కామెంట్లపై వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఒంటికాలితో లేస్తున్నారు.. అయ్యన్న, చంద్రబాబు, టీడీపీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు వైసీపీ నేతలు.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..