అమరావతి : అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని.. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని.. హోమ్ మంత్రి మేకతోటి సూచరిత ఫైర్ అయ్యారు. దళిత హోం మంత్రిగా సీఎం జగన్ నాకు అవకాశం కల్పించడం టీడీపీ నేతలకు రుచించడం లేదని… అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నాని తెలిపారు.
దళిత మహిళకు ఉన్నత పదవి ఇవ్వడం అయ్యన్నపాత్రుడుకు నచ్చడం లేదా ? అయ్యన్న పాత్రుడు సంస్కార హీనంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా దూషిస్తున్నారని… ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ పై టీడీపీ మాటలు హాస్యాస్పదంగా ఉందని… టీడీపీ హయాంలో వంగవీటి మోహన్ రంగ హత్యకు గురయ్యారని తెలిపారు. జగన్ పై హత్యాయత్నం చేస్తే టీడీపీ నేతలు ఎగతాళి చేశారని… రాజీనామ చెయ్యమని సీఎం జగన్ చెప్తే ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు మంత్రి సుచరిత.