చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దూసుకుపోతుంది. ఆ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్‌సీపీకి 17, టీడీపీకి 2 గెలిచాయి. అలాగే…. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచింది వైయస్సార్‌సీపీ. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచింది వైయస్సార్‌సీపీ. ఇక శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్‌సీపీ, 1 చోట టీడీపీ గెలుపొందాయి. మరో 6 చోట్ల ఫలితాలు రావాల్సి ఉండగా… ఇదే బాటలో జడ్పీటీసీల ఫలితాలు ఉన్నాయి. అయితే… ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ ఓటమి పాలైంది. వైయస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య వేయి ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. దీంతో చంద్రబాబు నాయుడికి పరాభవం తప్పలేదు.