ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ‘ముందస్తు’ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. అధికారంలోకి ఉన్న వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ ఏకం అవుతాయా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయంగానూ ఫుల్…
అమ్మకానికి భారత దేశం ఉందని… వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్నారు మొట్టమొదటి ప్రధాని మోడీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు మొట్టమొదటి ప్రధాని మోడీ. క్యాబినెట్ సమావేశనికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడు ఆయన అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తుంది.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని తెలిపారు. ఇక ఏపీలో విద్యుత్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి కొడాలి నాని.. కమ్మలకు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ అనటం సిగ్గు లేనితనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు, చంద్రబాబుకు అండగా ఉంటాను అంటున్నాడు.. కమ్మ కులం అంటే ఈ నలుగురే అనుకుంటున్నాడు పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.. ఏ రాజకీయ నాయకుడు అయినా పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా…
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తెలుగు తమ్ముళ్లు వరుసగా ఆహ్వానాలు పంపుతున్నారు. తమ జిల్లాల్లో పర్యటనలు చేయాలని కోరుతున్నారట. దీనికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ జిల్లా పర్యటనలకు వస్తానని వారందరికీ అభయం ఇస్తున్నారట. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ టీడీపీలోనే జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ ను టీడీపీ నేతలు మచ్చిక చేసుకుని సీటును…
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ మధ్య టీడీపీ దీన్ని బాగా ఫాలో అవుతోంది. ఒకప్పటి ఆప్త మిత్రుడు పవన్‌కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన్ను వైసీపీ విమర్శిస్తే టీడీపీ కస్సుమని ఒంటి కాలిపై లేస్తోంది. అది పార్టీలోని ఓ వర్గ నేతలకు అస్సలు నచ్చడం లేదట. మనల్ని పట్టించుకోని అతనికేంటి అంత ప్రయార్టీ అంటూ ఒకటే గుసగుసలు.. రుసరుసలట..! ఇటీవల పవన్‌కు అండగా టీడీపీ కామెంట్స్..! ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తులు.. సమీకరణాలు…
గత ఏడేళ్లుగా ప్రధాని మోడీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి హైవే లు, ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ వంటివి కేంద్రమే రాష్ట్రంలో నిర్మాణం చేస్తుందని.. రూ. 2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా ఎవరూ రాని దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రోడ్ల మరమత్తులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేశారని కానీ…. తాము 7 నెలల క్రితమే చేపట్టామన్నారు. టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కనిగిరికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నదుల అనుసంధానం చేసి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని.. కానీ, పక్క రాష్ట్రంతో గొడవపడి హక్కులన్ని కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు. కాల్వలు తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి…
టీడీపీ అధినేత చంద్రబాబు చూడని రాజకీయం.. చూడని ఎత్తుపల్లాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. అలాంటి చంద్రబాబు తన రాజకీయం జీవితంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత నియోజకవర్గంలోనూ పార్టీని గాడినపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తుంది.…
డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన కామెంట్స్ ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయా? రాజకీయ లబ్ధికోసం గుడ్డిగా ఏదేదో మాట్లాడి ఓ సామాజికవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితి దాపురించిందా..? కాకినాడ ఎపిసోడ్ తర్వాత టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలేంటి.. రుసరుసలేంటి..? కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..! ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుబడిన అంశాన్ని అధికార వైసీపీకి చుట్టేస్తూ.. టీడీపీ పెద్దఎత్తున ప్రెస్మీట్ల పోరాటం చేస్తోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయేంత వరకు టీడీపీలో చంద్రబాబు…
ఆ మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ కీలకంగా భావించే ప్రాంతానికి చెందిన నాయకుడు. నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్ కూడా. ఆయనకు తెలియకుండానే అక్కడ కొందరికి పార్టీ పదవులు ఇచ్చేశారు. పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదా? సైడ్ చేసిందా? లైట్ తీసుకుంటుందా? ఎవరా నాయకుడు? ఏంటా ప్రాంతం? శ్రావణ్ కుమార్‌కు చెప్పకుండానే స్థానికులకు టీడీపీలో పదవులు..! శ్రావణ్ కుమార్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే. రాజధాని అమరావతిలోని కీలక నియోజకవర్గమైన తాడికొండలో 2014లో టీడీపీ నుంచి గెలిచారు. గత ప్రభుత్వం అమరావతికి…