తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది… ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి… మరికొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది.. గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి.. వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్పై ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. గంజాయి విషయంలో టీడీపీ నేతలకు నోసులు ఇవ్వడంపై స్పందిస్తూ.. సీఎంను టార్గెట్ చేశారు…
ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జన గణన చేపట్టాలని ప్రధానిని లేఖలో కోరారు చంద్రబాబు. బీసీలకు సంబంధించిన సరైన డేటా లేకపోవడంతో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోందని… ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. బీసీ జన గణన పక్కాగా జరిగితేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని.. బీసీ జన గణన చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీలో…
ఏపీలో మరోసారి మినీపోరుకు రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వరుస ఎన్నికల్లో వైసీపీనే ఏకపక్ష విజయాలు సాధిస్తూ వెళుతోంది. పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ తదితర ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీచింది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి కనీసం పోటీ ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందకు దాదాపు 80నుంచి 90శాతం స్థానాల్లో వైసీపీ ఖాతాలోకే వెళ్లడం విశేషం. అయితే అనివార్య కారణాలతో దాదాపు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి…
మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది రాష్ట్రంలో. టిడిపి హయాంలో అప్పులు చేసి సంపద సృష్టికి ఉపయోగించాము. ఆదాయాన్ని పెంచే మార్గం చూపించాము. జగన్ చేసిన అప్పుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది. 5నెలల్లో 8 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి…
కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరొకటి ఎగిరిన దాఖలాలు లేవు. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లాలోని పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా అలాగేనని అందరికీ తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ టీడీపీ హవానే కొనసాగుతూ వస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కుప్పంలో వైసీపీ క్రమంగా బలపడుతుండగా టీడీపీ బలహీనమవుతోంది.…
బెజవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బెజవాడ టీడీపీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. బెజవాడలోని కేశినేని భవన్లో చంద్రబాబు ఫొటోలను తొలగించారు. చంద్రబాబు ఫొటోలతో పాటుగా, టీడీపీ నేతల ఫొటోలను కూడా తొలగించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. నేతల ఫొటోల స్థానంలో రతన్ టాటా ఫొటోలను ఉంచారు సిబ్బంది. ఇక ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంపీగా మాత్రమే కొనసాగుతానని…
చంద్రబాబు ఒక పగటి వేషగాడు… పిట్టలదొర అని మంత్రి కొడాలి నాని అన్నారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను , వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు..మా ఫోన్లు బ్లాక్ లో…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసరా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కృష్ణ జిల్లా గొల్లపూడిలో ఘనంగా ఆసరా వారోత్సవాలు చెప్పటింది ప్రభుత్వ యంత్రాంగం. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అయితే అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… గడచిన మూడున్నర దశాబ్ధాల్లో ఒక్క గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. పసుపు జెండాలుంటేనే పథకాలిచ్చారు. టీడీపీలాగా జన్మభూమి కమిటీలతో మాకు పనిలేదు అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో…
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి…