గెలుపోటములు దైవాదీనం. ఎవరినీ ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ముందుగానే చెప్పడం కష్టం. రాజకీయాల్లోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే జనాల్లో ఫేస్ వాల్యూను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ అధినేత చరిష్మా కూడా తోడైతే ఇక అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కేవలం అధినేత ఫొటోతోనే గెలుపు సాధ్యమా? అంటే ఇందులో కొంత వాస్తవం ఉందనే చెప్పొచ్చు.…
ఏపీలో ప్రతిపక్ష రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వద్దనుకుని వదిలేసుకున్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలుపుతున్నాయి. చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టు పావులు కదుపుతున్నాయి. పక్క పార్టీ పొడే గిట్టని వాళ్లు ఈ పొత్తులకు ఎలా ఒప్పుకున్నారో…. బీజేపీని వదిలి టీడీపీ వెంట జనసేన పరుగులు? 2019 ఎన్నికలకు ముందు ఏపీలో.. టీడీపీ బీజేపీని వదిలేసింది.. జనసేన టీడీపీని వద్దనుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ఇప్పటికీ అదేపొత్తు కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో ఏదైనా విషయం వస్తే…
ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. దీంతో, టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలి అన్నా జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి.…
ఆ జిల్లాలో వారి బాధను టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. వరస ఓటములతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నా వినేవాళ్లే లేరట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబును మించిన ఆవేదనలో టీడీపీ తమ్ముళ్లు..! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే గెలిచారు. మిగిలినచోట్ల వైసీపీదే విజయం. అది మొదలు.. పంచాయతీ,…
ఏపీలో టీడీపీకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయా? గవర్నర్ అపాయింట్మెంట్ పొందడంలోనూ ఆ పార్టీ విఫలం అవుతోందా? లోపం ఎక్కడుంది? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రణాళికలో లోపమా? మరేదైనా కారణమా? రాజకీయ పార్టీలు గవర్నర్‌తో భేటీ కావడం సాధారణం. ప్రభుత్వాలపై ఫిర్యాదు చేసేందుకు.. వివిధ విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తుంటారు నాయకులు. గవర్నర్ వ్యవస్థపై టీడీపీకి మొదటినుంచి తీవ్ర అసంతృప్తి ఉన్నా.. ఆయా సందర్భాలలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో…
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికల్లో మొదలైన…
ఆయనో సీనియర్ నాయకుడు. ఆ జిల్లాలో ఒకానొక సమయంలో చక్రం తిప్పారు కూడా. భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ జీవితమే క్వశ్చన్ మార్క్‌గా మారిపోయింది. ఉన్నచోట ఇమడలేక.. పాతగూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? పార్టీ మార్పుపై మరోసారి దృష్టిపెట్టారా? కొత్తపల్లి సుబ్బారాయుడు. ఉమ్మడి ఏపీలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ఎదిగిన సుబ్బారాయుడు.. ప్రస్తుతం ఏ…
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్…
ఆ జిల్లాలో టీడీపీకి మరోసారి ఇబ్బందులు తప్పలేదు. పేరుకు ఎన్నికలు బహిష్కరణ అని చెప్పినా.. బ్యాలెట్ పేపరుపై పార్టీ సింబల్ ఉంది. అభ్యర్థులు ప్రచారం చేశారు. కానీ.. ఓట్లు రాలేదు. సెంటిమెంట్ పండలేదు. పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. ఇంతకీ ఏంటా జిల్లా? అధికారం కోల్పోయాక అసలు సంగతి గుర్తించారా? టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2014 ఎన్నికల వరకు పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక…