సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు టీడీపీ నేత నారా లోకేష్.. తొలగించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేఖలో కోరిన ఆయన.. 20 నెలల జీతాల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.. పాదయాత్ర చేస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేనున్నాను.. నేను మీ గోడు విన్నాన్నారు.. మీ మాటలు నమ్మి ఓట్లేసిన ఆ ఉద్యోగులంతా మీరు సీఎం కాగానే.. వాళ్లకిచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఆశ పెట్టుకున్నారు.. కానీ, మీరు సీఎం కాగానే హామీలన్నీ గాలికొదిలేశారని లేఖలో దుయ్యబట్టారు.. ఇక, మీ నేతలు పోస్టులు అమ్ముకోవడం వల్ల ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించేశారని ఆరోపించారు నారా లోకేష్.
ఒక్కవైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న వేలాది మందిని అప్కాస్ లోకి తీసుకున్నట్టు పత్రాలు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులు కింద సీఎఫ్ఎంఎస్ ఐడీలు క్రియేట్ చేసి ఉద్యోగుల గొంతు కోశారని ఆరోపించారు నారా లోకేష్.. ఏజెన్సీలు లేకుండా జీతాలు ఎలా ఇవ్వగలమంటూ 20 నెలలు జీతాలు ఎగ్గొట్టి అందరినీ ఉద్యోగాల్లోంచి తీసేసి పంపేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం చేసిన నిర్వాకాల వల్ల 20 నెలల జీతాలు రాక, వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు పస్తులుంటున్నాయన్నారు.. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా వీరికి సీఎఫ్ఎంఎస్ లో నమోదు చేయడంతో తెల్ల రేషన్‌కార్డులు రద్దయ్యాయని సీఎం దృష్టికి తీసుకెళ్లిన నారా లోకేష్.. వారు అమ్మ ఒడితోపాటు ప్రభుత్వ పథకాలు దేనికీ అర్హులు కాకుండా పోయారన్నారు.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్‌ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి