‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా?..’ అన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు. ఐటీని తామే ప్రవేశపెట్టమని.. సాంకేతికతకు తామే ఆద్యులమని చెప్పుకునే టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నారన్న టాక్ నడుస్తోంది.. సాంకేతిక ప్రవేశపెట్టడం కాదు.. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలంటూ వారిపై పలువురు సైటర్లు వేస్తున్నారు.
రాజకీయాల్లో సాంకేతికత పరిజ్ఞానాన్ని నూటికి నూరుపాళ్లు జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారు. అన్నింటిని ఆన్ లైన్ చేస్తున్న వైసీపీ సర్కారు ప్రచారాన్ని సైతాన్ని అదే తరహాలో వాడుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ట్రెండ్ సెట్టర్ గా మారారు. పాదయాత్ర, బహిరంగ సభల్లో డ్రోన్ కెమెరాల సాంకేతికతను వాడుకున్నారు. లక్షలాది మంది జనాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి అలా నడిచి వస్తున్న దృశ్యాలు.. బహిరంగ సభల్లో జగన్ మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చే రియాక్షన్స్ వంటివి డ్రోన్ కెమెరాలతోనే చిత్రీకరించే వాళ్లు.
ఈ విజువల్స్ అన్నీ కూడా అప్పట్లో సెన్సేషనల్ గా మారాయి. జనంలో జగన్ ఉన్న క్రేజ్ ఉంటో కూడా అందరికీ తెలిసి వచ్చేలా చేసింది. ఇక అధికారంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. వైసీపీ సర్కారు ఏ పథకం ప్రవేశపెట్టిన, భారీ కార్యక్రమాలు ప్లాన్ చేసిన డ్రోన్ కెమెరాలను తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 104, 108 అంబులెన్స్.. రేషన్ సరుకుల పంపిణీ వాహనాలను భారీ ఎత్తున ప్రారంభించారు. ఒకేసారి వందలాది వాహనాలను సీఎం జగన్మోహన్ లాంఛ్ చేశారు.
ఈ విజువల్స్ డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి మీడియాకు విడుదల చేశారు. ఈ దృశ్యాలన్నీ కూడా ప్రజలను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా చెత్తసేకరణ వాహనాలను సైతం వైసీపీ సర్కారు ప్రారంభించింది. బెంజ్ సర్కిల్ ఏరియాలో భారీ స్థాయిలో ఒకేసారి వందలాది చెత్తసేకరణ వాహనాలను లాంఛ్ చేశారు. అన్ని జిల్లాల్లోనూ కళ్లకు కట్టినట్లుగా డ్రోన్ కెమెరాలతో ప్రభుత్వం విజువల్ రికార్డు చేసింది. ఈ ఫుటేజ్ ను మీడియాకు రిలీజ్ చేయగా ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి సాంకేతికను వాడుకోవడం చూసి టీడీపీ నేతలు కుళ్లుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం డ్రోన్ కెమెరాలను వాడారు. అయితే అది కేవలం ఫొటోలు తీయడానికి పరిమితం చేశారు. చంద్రబాబు హయంలోనూ రైతురథం పేరుతో భారీగా ట్రాక్టర్ల పంపిణీ చేపట్టారు. అయితే అన్నింటిని ఒకచోట చేర్చి పంపిణీ చేస్తే ప్రజల్లో ఒక ఇంపాక్ట్ ఉండేది. కానీ వారికి ఆ ఐడియా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమం భారీగా చేస్తే డ్రోన్ల సాంకేతికతను వాడుకొని ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. దీంతో జగన్ వాడకం అంటే మాములుగా ఉండదంటూ కామెంట్స్ విన్పిస్తున్నాయి.