విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… సీఎం వైఎస్ జగన్‌కు స్టీల్ ప్లాంట్‌పై చిత్తశుద్ధి ఉంటే… తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.. కాసేపటి క్రితం టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించారు.. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా అన్ని శక్తులను కేంద్రీకరించాలని…
ఏపీలో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన పంచాయతీలకు, 15న మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహాణ ఉంటుంది. 14వ తేదీనే పంచాయతీలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇక 17వ తేదీన మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు కౌంటింగ్… 18వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కౌంటింగ్ ఉంటుంది. అయితే ఏపీ వ్యాప్తంగా మొత్తంగా 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69…
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 45 రోజుల పాటు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నవారు రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా నిలువాలన్నారు. రాజధానికి కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో…
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సర్కార్ ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం విద్యను పేద విద్యార్థులకు అందకుండా ప్రతిపక్ష నేతలు ఏపీ ప్రభుత్వం మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సురేస్ ఎయిడెడ్ స్కూళ్లను తాము ప్రక్షాళన చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటినే మూసివేస్తున్నామని.. ప్రైవేటు విద్యకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనిని పక్కన…
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన బద్వేల్ ఉప ఎన్నికకు పోలింగ్ నిన్న ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దొంగఓట్లు వేయించారని ఆరోపించారు. అంతేకాకుండా 28 చోట్ల రెగ్గింగ్ జరిగిందని, వివిధ ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగఓట్లు వేయించారని అందుకే ఓటింగ్ శాతం కూడా పెరిగిందన్నారు. అధికారంలో వైసీపీ పార్టీ బద్వేల్లో ఓడిపోతామని తెలిసే…
రైతు భరోసాతో వ్యవసాయం సాఫీగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయం దండగ అన్న వ్యక్తులే ఇప్పుడు రైతుల పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు, కరువు కవలలు అన్న నానుడి రాష్ట్రంలో ఉందని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక వరుసగా మూడు సీజన్లలలో వర్షాలు వచ్చాయన్నారు. రైతు…
టీ కొట్లు.. రచ్చబండల మీద జరిగే చర్చలు యమ రంజుగా ఉంటాయి. రాజకీయాలపై చాలా ఆసక్తిగా చర్చలు అక్కడ జరుగుతుంటాయి. ఒక మాజీ మంత్రిపై ఆ నియోజకవర్గంలో అలాంటి చర్చే నడుస్తోందట. చర్చకు కారణం ఆయనపై వచ్చిన ఒక కరపత్రం. ఆ కరపత్రాల టాక్స్ టీకొట్ల వరకు ఆగితే ఓకే.. పార్టీ అధినేత వరకు వెళ్తే ఏంటన్నదే ప్రశ్నగా మారింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..! కాల్వ చుట్టూ టీడీపీలో విమర్శలు..! గతంలో అనంతపురం జిల్లా టీడీపీలో…
బెజవాడ టీడీపీ అంతర్గత రాజకీయాల్లో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. పార్టీకి దూరమైపోతారని భావించిన కేశినేని నాని రీయాక్టీవ్ అయ్యారు. అప్పటి వరకు యాక్టీవ్‌గా ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమాలు డీలా పడ్డారు. ఇంతకీ ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? చంద్రబాబు దీక్షతో మారిన బెజవాడ టీడీపీ సీన్..! మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బెజవాడ టీడీపీ టీమ్ బాగా డిస్ట్రబ్ అయింది. నగరంలో ‘టీమ్ టీడీపీకి’ కీలకంగా ఉన్న ఎంపీ…
బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడం సంతోషదాయకమని ప్రభుత్వ చీఫ్ విప్, వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయకుండా, పోలింగ్ శాతాన్ని తగ్గించాలనే దురుద్దేశంతో బీజేపీ చాలా అరాచకాలు చేయడానికి ప్రయత్నించింది.…
కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముగిసే సమయానికి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఏంలను పోలింగ్ సిబ్బంది సీల్ చేస్తున్నారు. అనంతరం ఈవీంఏంలను భారీ భద్రతతో స్ట్రాంట్ రూంకి తరలించనున్నారు. అయితే సాయంత్రం 5 గంటలకు వరకు 59 గా పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారుల వెల్లడించారు. 2019లో 77 శాతం…