రావెల కిషోర్‌బాబు రూటు మారిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్యం చెప్పే హరిచ్ఛంద్రులం.. అవసరానికో అబద్ధం అన్నట్టు.. రాజకీయ నాయకుల నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకోవడంలో పొలిటీషియన్స్‌ను మించివాళ్లు ఉండరు. గుంటూరు పాలిటిక్స్‌లో ఇప్పుడదే జరుగుతోంది. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబుకు బాగా కలిసొచ్చిందనే చర్చ మొదలైంది.
రెండేళ్ల క్రితం రావెల బీజేపీలో చేరారు. కాషాయం కండువా కప్పుకొని కనిపిస్తున్నా.. ఆయన మనసంతా టీడీపీలో ఉన్నట్టు, సైకిల్‌ను బాగా మిస్సవుతున్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరినా.. తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రావెలకు ఇప్పుడా అవకావాన్ని కల్పించిందని, అందుకే తాటికొండలో మొదలైన పాదయాత్రను అంతా తానై తిరుమల వరకు నడిపించేందుకు రావెల ప్లాన్ సుకున్నారని తెలుస్తోంది.
Also Read
పాదయాత్రకు ఏ పార్టీ నాయకులు వచ్చినా వారిని ఆహ్వానించి సందడి చేస్తున్నారు రావెల. ముఖ్యంగా టీడీపీ నేతలు ఎరపతినేని, ధూళిపాళ్ల, ప్రత్తిపాటి లాంటి సీనియర్ లీడర్లను అంటుకుని తిరుగుతున్నారు. టీడీపీ నేతలు కూడా రావెల అనవసరంగా బీజేపీలోకి వెళ్లారని కార్యకర్తలతో చెబుతున్నారు. రావెల కూడా నేనెప్పుడూ మీ వాడినే అంటూ వారిని కుషీ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మందకృష్ణ, చంద్రబాబుల మధ్య జరిగిన రహస్య భేటీలో రావెల కీలకంగా పనిచేశారని కూడా తెలుస్తోంది. దీంతో టీడీపీలోకి రావెల రీ ఎంట్రీ ఖాయమని, అధినేత అంగీకారం కూడా ఉందనే ప్రచారం మొదలైంది.
ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయం చేయాలంటే టీడీపీ, లేదా వైసీపీలో ఉండటం ఒక్కటే మార్గమని, బీజేపీలో ఉండటం వల్ల లాభం లేదని రావెల ఫీలవుతున్నట్టు సమాచారం. ఎలాగూ వైసీపీలో చేరే ఛాన్స్ లేకపోవడం, తనను మంత్రిని చేసిన చంద్రబాబుపై కృతజ్ఞత ఉండటంతో.. సైకిల్ ఎక్కడం ఒక్కటే తనముందున్న మార్గం అని రావెల భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కూడా రావెల రీ ఎంట్రీతో ఎస్సీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని ఆలోచిస్తోంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా రావెలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరి ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!