బీజేపీ పార్టీపై ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి కొడాలి నాని. బీజేపీ బెదిరింపులకు బయపడడానికి ఇక్కడ ఉన్న సీఎం జగన్ మేక కాదు.. పులి అని… బీజేపీ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు కొడాలి నాని. అధికారంలో ఉండగానే సోనియాగాంధీ ని ఎదిరించి బయటకి వచ్చిన మగాడు జగన్ అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ లను ప్రజలు తగులబెడతారని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సర్‌ఛార్జీ విధించినట్లు కొడాలి నాని గుర్తుచేశారు. ఎక్కడైనా పెట్రోల్ ధరలను ముఖ్యమంత్రి తగ్గిస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీకి ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదన్నారు. చంద్రబాబు లుచ్చా రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీని ఓటర్లు పెట్రోల్ పోసి తగులపెట్టారని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.