ఏపీ టీడీపీ నేతలు ఉన్నట్టుండి నా గుణింతాన్ని వల్లె వేస్తున్నారా? బోస్డీకే అంటూ.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన పట్టాభి రీఎంట్రీ తర్వాత ఇది మరీ ఎక్కువైందా? కొత్త పల్లవిపై టీడీపీ వర్గాల స్పందనేంటి? నా గుణింతం వల్లె వేసిన పట్టాభి..! పార్టీ గొప్పదా.. వ్యక్తులు గొప్పా? ప్రస్తుతం టీడీపీలో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. బోస్డీకే అని విమర్శించి.. రాజకీయ వేడి రగిలించి.. జైలుకెళ్లొచ్చాక.. ఫ్యామిలీతోపాటు విదేశాల్లో రిలాక్స్ అయిన టీడీపీ నేత…
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది… అయితే, ఈ పాదయాత్రలో పాల్గొనకుండా.. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌కు చలి జ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించిన ఆయన.. మహాపాదయాత్ర రాజకీయ యాత్ర కాదు.. భావితరాల భవిష్యత్ యాత్రగా అభివర్ణించారు.. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ…
ఆంధ్రప్రదేశ్‌ను విద్యలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నాం.. ఐదు, పదేళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ కార్యాలయంలో జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందన్నారు.. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి…
ఎన్నికలొచ్చాయంటే.. రాజకీయ పార్టీల వ్యూహాలు ఒక యుద్ధాన్ని తలపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ మంత్రి నియోజవర్గంలో జరుగుతున్న పురపోరులో అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ ఒక ప్లాన్‌లో వెళ్తే.. వైసీపీ నేతలు బహుముఖ వ్యూహాంతో వెళ్తున్నారు. ఒక చిన్న మున్సిపాల్టీ కోసం అంత ఎఫర్ట్ అవసరమా.. ఎందుకు వైసీపీ అంత ఛాలంజింగ్ గా తీసుకుందీ అన్నది ఆసక్తికరంగా మారింది. అనుకోకుండా వచ్చిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల ఏపీలో పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. కుప్పం…
అనంతపురంలో కొడికొండ చెక్‌పోస్టు వద్ద టీడీపీ కార్యకర్తలు నారాలోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా నారాలోకేష్ వారితో కాసేపు మచ్చటించారు. మనం పోరాటం చేయటమే ముఖ్యమని, ప్రజల మనవైపే ఉన్నారని లోకేష్ అన్నారు. చింతపండు మొదలుకొని నూనె, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ప్రజలు అన్ని గమనిస్తు న్నారని, త్వరలోనే వైసీపీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ప్రజలతో కలిసి ఉంటూ, ప్రజలకు అండగా నిలబడాలన్నారు. ధరలపై పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు మన…
చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోఎన్‌ఈసీ ఆదేశాలనుసారం అధికారులు నడవాలి కానీ, డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్ఈసీ ఎన్నికల నిబంధనలు ఏమైనా మార్చారా అంటూ ఆయన మండిపడ్డారు.…
ఏపీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నట్లు గవర్నర్ బిష్వభూషణ్ నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే 18న జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు కానున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏపీ ప్రత్యేక హోదా లతో పాటు పలు కీలక…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ను ఏక వచనం తో పిలుస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రభుత్వ జీవోను కూడా నారా లోకేష్ పలకరాదన్నారు. జీవోను నారా లోకేష్ నోరు తిరకగ జీయో అని అంటాడని ఎద్దేవా చేశాడు. నారా లోకేష్ కు నోరు తిరగక పోతే ఇంట్లో కూర్చోవాలని అన్నాడు. అంతే కాకుండా నారా లోకేష్ తెలుగు రాకపోతే సరిగ్గా…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఇక, కుప్పం మున్సిపల్ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందని చెప్పి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. 14వ వార్డులో ప్రపోజర్ విత్ డ్రా చేయడం వల్ల ఓ నామినేషన్ తిరస్కరణకు గురై మా అభ్యర్థి ఏకగ్రీవంగా…
చంద్రబాబు, నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని.. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సంచలన కామెంట్లు చేశారు.. సీఎంను దున్నపోతు అంటూ లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రి ఇంటిని తాకుతా అంటున్నాడు.. రా.. నా కొడకా… ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు… చూస్తా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక, లోకేష్, చంద్రబాబు తోలు ఒలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టిస్తా అంటూ సంచలన…