HeyBalwanth : హే బలవంత్ ఓవర్సీస్ & ప్రీమియర్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుహాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా హే భగవాన్. సెన్సార్ సమస్యతో హే బలవంత్ గా టైటిల్ మార్చుకున్న ఈ సినిమా గత రాత్రి ప్రిమియార్స్ తో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే ‘హే బలవంత్’ కామెడీ నేపథ్యంలో సాగే ఒక సాదాసీదా ప్రయత్నం. సినిమా మొదటి భాగం కాస్త ఆసక్తికరంగానే మొదలవుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే, ఒక “బిజినెస్” చుట్టూ తిరిగే ఈ కామెడీ మొదట్లో బాగున్నా, కథ ముందుకు సాగే కొద్దీ రిపీటెడ్ సీన్లతో విసుగు తెప్పిస్తుంది. ఆ బిజినెస్ వెనుక ఉన్న జస్టిఫికేషన్ కూడా అంత కన్విన్సింగ్‌గా లేదు.
సినిమాకు అసలు సమస్య సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్ సెకండ్ హాఫ్‌లో మిస్ అయ్యింది. కథ ఎటు వెళ్తుందో అర్థం కాని విధంగా సాగుతూ ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్లు కథలో సహజంగా కాకుండా, బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. దీనివల్ల ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వలేకపోయాడు. నటుడు సుదర్శన్ తన వన్-లైనర్లతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతనికి మంచి పాత్ర లభించింది, తన టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అయితే, సీనియర్ నటుడు నరేష్ పాత్ర మాత్రం చాలా అండర్-వెల్మింగ్‌గా ఉంది, ఆయన ప్రతిభకు తగ్గ రోల్ కాదనిపిస్తుంది. పాటల గురించి చెప్పాలంటే, అవి సినిమా వేగానికి పెద్ద స్పీడ్ బ్రేకర్లలా మారాయి. ఫైనల్ గా #HeyBalwanth’ అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ, ఒక సినిమాగా పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. కామెడీ పండకపోవడం, బలహీనమైన సెకండ్ హాఫ్ ఈ సినిమాకు ప్రధాన మైనస్ అని కేవలం కొన్ని కామెడీ బిట్స్ కోసం మాత్రమే చూసే వారికీ ఇది ‘బిలో యావరేజ్’ సినిమా అనే టాక్ ఓవర్సీస్ ఆడియెన్స్ నుండి వస్తోంది.
Also Read
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
తాజావార్తలు
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!