పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచారు.. అయితే, చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేననే నమ్మకాన్ని వ్యక్తం…
చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఫైర్ అయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సోషల్ మీడియా వేదికగా తాజా మాజీ మంత్రి అవంతికి కౌంటర్ ఇస్తూ.. విశాఖని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలల ఆడియో విడుదల తప్ప ఏమైనా జరిగిందా..? విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయైనా…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులపై చర్చలు మొదలయ్యాయి… జనసేన ఆవిర్భావి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ వేదికగా పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేయగా.. ఇప్పుడు.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో పొత్తుల విషయంపై మాట్లాడుతూనే ఉండగా… మరోవైపు.. చరిత్రలో పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర అసలు టీడీపీకి ఉందా? అని…
వరుసగా అన్ని చార్జీలు పెరిగిపోయాయంటూ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీడీపీ… వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న యాత్ర చంద్రబాబుకి బాదుడే బాదుడు యాత్ర అవుతుందన్న ఆయన.. శవాల వద్దకే చంద్రబాబు యాత్ర అని పేరు పెట్టుకోవాలని.. ఎందుకంటే చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also: Nadendla Manohar: ఓట్లు…
వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కొత్త నినాదం అందుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అన్నవరంలో తుని, ప్రత్తిపాడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మన నినాదం అన్నారు.. క్విట్ ఇండియా ఉద్యమం లాగే ఈ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులను కూడా బజారుకి ఈడుస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు.. కౌరవ సభను.. గౌరవ సభ చేసిన తర్వాతనే…
అమరావతిని రాజధానిగా చేస్తాం.. విశాఖను అభివృద్ధి చేస్తామంటూ గురువారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు… ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటూ మండిపడ్డారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణి ఓ వివాదంలో చిక్కుకున్నారు.. తమిళ సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమ తరఫున ఆయన మాట్లాడడం వివాదానికి కారణమైంది.. ఇతర రాష్ట్రాల్లో షూటింగులు జరగడంతో తమిళనాడు ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తమిళ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాయి… అయితే, సెల్వమణిపై మండిపడుతోంది తెలుగుదేశం పార్టీ.. సెల్వమణి వ్యాఖ్యలపై మంత్రి రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. Read…
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడూస్తూనే ఉంది.. ఓవైపు కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పెరిగిన ధరలపై బాదుడే బాదుడు పేరుతో ఉద్యమం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూంది.. అయితే, కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం వల్ల జగన్‌కు, వైసీపీ నేతలకు ఆత్మ సంతృప్తి…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. జిల్లాల పర్యటనలో భాగంగా.. ఇవాళ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక, సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: Kedarnath: తెరచుకున్న కేదార్నాథ్.. భక్తుల పులకింత.. చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. * అన్నవరంలో ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ముఖ్య…
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి రక్తం బాగా మరిగిన పులికి వేటాడటానికి మనుషులు దొరకనప్పుడు ఎలా పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తుందో, అధికారం పోయినందుకు చంద్రబాబుకి అదే పిచ్చి హిమాలయాలకు చేరిందని ఆరోపించారు. దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు దాదాపు 1.39 లక్షల కోట్లు… అది కూడా 35 నెలల్లో పేదల చేతిలో వైసీపీ ప్రభుత్వం పెట్టిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంటనక్కకు…