గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరి పంటపై తాము చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు బాగా కురిసి పంటల దిగబడి గననీయంగా పెరిగిందన్నారు. రైతులు పండించే వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. ఇది భారంగా మారకూడదని మాత్రమే తాను అన్నానన్నారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు.…
మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవడనికి టీడీపీ కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.. కానీ, పదవులకోసం పాకులాడకూడదని హితవుపలికారు.. కార్యకర్తలకు సొంత ఎజెండాలు వద్దు అని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా…
ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన కార్యవర్గంలో ప్రొద్దుటూరు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి చోటు కల్పించింది ఆ పార్టీ హైకమాండ్. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పీసీసీలో పదవి ఇవ్వడంతో అది చూసిన వాళ్లు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారని అనుకున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌లో చేరారని భావించారు. అయితే కాంగ్రెస్‌లో చేరలేదని.. ఇంకా టీడీపీలోనే ఉన్నారనని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. Read Also:…
ఏపీ డీజీపీని కలిశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. టీడీపీలో ఉంటే మంచోళ్లు.. లేకుంటే కాదా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని, పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు..…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి "ఇదేమీ ఖర్మ తెలుగు దేశానికి.." అనేది సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు.
తనను, లోకేష్‌ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.." కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలకు చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఈర్ష్య, అసూయ అని మండిపడ్డారు.. చంద్రబాబు వంటి కిరాతకులు, రాక్షసులు అడ్డుపడ్డా ఇళ్ల నిర్మాణం మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. అసలు, ఒక్క లబ్ధిదారుడైనా ఇబ్బంది కలిగిందని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు?…