ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు టీడీపీకి గుడ్‌బై చెబుతూనే ఉన్నారు.. ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా టీడీపీకి రాజీనామా చేసి.. స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, పార్టీ సీనియర్ నేత, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు సందించారు.. భూ సర్వే చారిత్రాత్మ క నిర్ణయమన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారు.. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయం.. భూ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే మొదటి స్థానంలో ముఖ్యమంత్రి జగనన్న నిలిపారని పేర్కొన్నారు.. కానీ, మీ భూములను లాక్కుంటున్నారని, గోల్ మాల్ చేస్తారని ప్రతిపక్షాలు…
ఇప్పటం వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కోర్టును ఆశ్రయించిన 14 మందికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ఇప్పటంలో అనవసర రాద్దాంతం చేశారు.. ప్రభుత్వాన్నే కూల్చాలని లోకేష్ విమర్శలు చేశారు.. చివరికి ఏమైంది? కోర్టునే మోసం చేసినట్టు తేలిందని ఫైర్ అయ్యారు.. పిటిషనర్లకు లక్ష చొప్పున పెనాల్టీ వేసింది అని గుర్తుచేశారు.. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు…
అవకాశం దొరికితే.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేయానికి సిద్ధంగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా, లోకేష్ తీస్తున్న ఓ సెల్ఫీకి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పంచ్‌లు వేశారు.. ”ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే…
ఏడ్చే మగాడిని.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.. అంటే, ఏడుపు అనేది మగవాని స్వభావానికి విరుద్ధం.. అదే విధంగా నవ్వు అనేది సామాన్య స్త్రీ స్వభావానికి విరుద్ధమట.. అందుకే ఈ సామెత వచ్చిందంటారు.. అయితే, ఈ సామెతను చెబుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. ఏడ్చే మగాడిని నమ్మకపోవడం మన సంస్కృతి.. ఆంధ్ర ప్రజలు ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో…
అనంతపురం జిల్లా రాప్తాడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి రాజకీయ వివాదాలే. మాజీ మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మధ్యలో రెండు వర్గాలు శాంతించినా.. పరిటాల సునీత పాదయాత్ర చేస్తాననడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఇంతలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని జాకీ పరిశ్రమ వివాదం కొత్తగా చుట్టుముట్టడంతో రాప్తాడులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. జిల్లాలో లేని పరిశ్రమ చుట్టూ సాగుతున్న పాలిటిక్స్ ఏకంగా తాడేపల్లిని తాకడంతో హాట్ టాపిక్‌గా మారిపోయింది.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకో సైలెంట్ అయ్యారనే అనుమానాలను వ్యక్తం చేశారు.. అయితే, ఇష్టం ఉన్నా లేకపోయినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు ఏపీలో కలిసి వెళ్లాలని కోరారు.. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.. అందుకే బీజేపీని…