మాచర్లలో జరిగిన ఘర్షణపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు.. అయితే, చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనే.. 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? అని ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు.. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నా ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు లేవన్న ఆయన.. మాచర్ల చంబల్ లోయ అయిందని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.. వైసీపీ కార్యకర్తలే తగుల బెట్టారని ఎలా అనుకుంటారు? నిజాలు విచారణలో తేలుతాయని స్పష్టం చేశారు. అసలు పిన్నెల్లి ఆ రోజు సీఎంవోలోనే ఉన్నారు.. గడప గడపకు కార్యక్రమంలో ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: పవన్‌కు సజ్జల కౌంటర్.. ఆ విషయం తెలుసుకోవాలి..!
మాచర్లలో గొడవలను టీడీపీ వారే రెచ్చగొట్టారని ఆరోపించారు సజ్జల.. ఇక, వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలే ప్రధాన లబ్దిదారులుగా తెలిపారు.. టీడీపీ హయాంలో ట్రైబల్ కమిటీ కూడా వేయలేదని విమర్శించిన ఆయన.. దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్న పథకాలు రద్దు చేసే ఉండొచ్చు అన్నారు. ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించారని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యాలయానికి ఆర్టీసీ స్థలం తీసుకుంటే అవసరమైతే ఆర్టీసికి పరిహారం ఇవ్వవచ్చా అనేది చూస్తామన్న ఆయన.. ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.. పెండింగ్ లో ఉన్న సమస్యలనూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.. ఉద్యోగులు, నేతలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.