పల్నాడు రాజకీయాలు మళ్లీ హీటుపెంచుతున్నాయి.. అయితే, పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని గోపిరెడ్డి అందించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారని విమర్శించారు.. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.. పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డిలని పల్నాడు నుంచి ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు అచ్చెన్నాయుడు..
Read Also: Today(21-12-22) Business Headlines: కేటీఆర్ దావోస్ పర్యటనతోపాటు మరిన్ని బిజినెస్ ముఖ్యాంశాలు
మాచర్లలో మెన్నటి విధ్వంసం మరువక ముందే పల్నాడులో మరో ముస్లీం కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుడుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. వైసీపీ నేతలు కృూర జంతువుల్లా టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటున్నారని.. ఇకనైనా హత్యా రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టకపోతే వైసీపీకి మిగిలేది శంకరగిరి మాన్యాలే అని హెచ్చరించారు. ఇబ్రహీం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.. ఇబ్రహీం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అని ప్రకటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.