తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. ఖమ్మం జిల్లాలో టీడీపీ బహిరంగసభపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిది.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదన్న ఆయన.. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని మండిపడ్డారు.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్లాడు.. కానీ, ఏం చేయాలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు.. రాష్ట్ర విభజనపై ఉన్నట్టుండి చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్రం అన్యాయంగా విడిపోయింది, సేవ చేయాలి అనే క్లారిటీ సీఎం వైఎస్ జగన్‌కు ఉందని స్పష్టం చేశారు.. అయితే, నాతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఉపయోగం ఉంటుందని బీజేపీకి చెప్పడమే బాబు ఉద్దేశంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Read Also: CM YS Jagan Kadapa Tour: మరోసారి సొంత జిల్లాకు సీఎం జగన్.. మూడు రోజుల పూర్తి షెడ్యూల్ ఇదే..
చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు రెండూ తెలంగాణలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు.. సీఎం వైఎస్ జగన్‌కు ఏపీలోనే ఉండాలనే విషయమై స్పష్టత ఉందన్నారు.. చంద్రబాబుకు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో.. ఏం కావాలనుకుంటున్నారో స్పష్టత లేదన్న ఆయన.. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.. తెలంగాణలో ఏదో ఒకలా బీజేపీని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.. చంద్రబాబుది మొదట్నుంచీ రెండు నాల్కల ధోరణే అని దుయ్యబట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఆరోపించారు.. ఇక, చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకునేందుకు మాకేం పని.. చంద్రబాబును అడ్డుకుంటే మాకు ఏమి వస్తుంది? అని ప్రశ్నించారు.. అసలు వెంటిలేటర్ పైన ఉన్న పార్టీ తెలుగుదేశం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.