ఏపీ డీజీపీని కలిశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. టీడీపీలో ఉంటే మంచోళ్లు.. లేకుంటే కాదా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని, పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు..…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి "ఇదేమీ ఖర్మ తెలుగు దేశానికి.." అనేది సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు.
తనను, లోకేష్‌ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.." కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలకు చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఈర్ష్య, అసూయ అని మండిపడ్డారు.. చంద్రబాబు వంటి కిరాతకులు, రాక్షసులు అడ్డుపడ్డా ఇళ్ల నిర్మాణం మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. అసలు, ఒక్క లబ్ధిదారుడైనా ఇబ్బంది కలిగిందని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు?…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు టీడీపీకి గుడ్‌బై చెబుతూనే ఉన్నారు.. ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా టీడీపీకి రాజీనామా చేసి.. స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, పార్టీ సీనియర్ నేత, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది..…