Minister Narayana: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు. తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలోని తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇక, మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది.. ఆగస్ట్ 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తేల్చి చెప్పారు. అలాగే, రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి మొత్తం 20 వేలు ఇస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం పథకం ద్వారా 10 వేల కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేశామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
Read Also: YSRCP: తాడిపత్రిలో వైసీపీ సమావేశం తాత్కాలికంగా వాయిదా.. కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
ఇక, రెండు, మూడు నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకుంది.. కార్మికులకు మేలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయానికి సీఎం ఆమోదం తెలిపారు.. ఆర్ధిక శాఖతో చర్చించి నాలుగైదు రోజుల్లో అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది.. అక్రమాలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పొంగూరు నారాయణ వెల్లడించారు.