Off The Record: సత్యవేడు పేరు వింటేనే… టీడీపీలో షేకవుతోందట. ఈ నియోజకవర్గంలోని వ్యవహారాలను చూసి… జిల్లా నేతలతో పాటు… పార్టీ పెద్దలు సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు పార్టీ టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇష్టం లేకపోయినా…. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా కలిసి ఆయన్ని గెలిపించుకున్నారు. అయితే… మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా…. మెల్లిగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు గ్రూపులుగా విడిపోయి తన్నుకోవడం మొదలెట్టారు సత్యవేడు టీడీపీ నేతలు. ఇదే సమయంలో తనను అదిమూలం లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ వీడియో రిలీజ్ చేసి కేసు పెట్టడం సంచలనమైంది. అయితే.. ఆదిమూలం కోర్ట్‌కు వెళ్ళడంతో ఆ కేసు నిలబడలేదు. పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసినా… ఎమ్మెల్యే గా మాత్రం కొనసాగుతున్నారు. ఇక నియోజకవర్గంలో ఉన్న నేతలు శ్రీపతి బాబు, చంద్రశేఖర్ నాయుడు, హేమలత,రాజశేఖర్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. గత ఎన్నికల్లో సొంత అభ్యర్థిని ఓడించేందుకు సైతం పనిచేసినట్టు చెప్పుకుంటారు.
Read Also: Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 150 అడుగుల లోతైన లోయలో పడ్డ కారు.. ఎనిమిది మందిమృతి..!
ఈ వివాదాల నడుమ వచ్చిన పార్టీ అబ్జర్వర్ చంద్రశేఖర్ నాయుడు… నేనేం తక్కువ కాదన్నట్టు అన్ని రకాల అక్రమాలకు ఆయనే కేరాఫ్అయ్యారన్నది పార్టీ టాక్. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు ఆయన కేంద్రంగా మారినట్టు చెప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత మేలో సత్యవేడులో పర్యటించిన లోకేష్.. పార్టీ పరిస్థితి గమనించి.. అప్పటిదాకా ఉన్న అందర్నీ పక్కన పెట్టి పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్తగా కాంట్రాక్టర్ శంకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అందుకు మొదట్లో అంతా తలూపేశారు. సీన్ కట్ చేస్తే.. తాజాగా అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన ఏకంగా ఎమ్మెల్యేనే పక్కనపెట్టి మీరే పనులు చేసుకుంటారా.. నన్ను కాకపోయినా.. నా కొడుకును అయినా పార్టీ కార్యక్రమాలకు తీసుకు వెళ్లవచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు కో-ఆర్డినేటర్ అంటారు, మరొకరు పరిశీలకుడు అంటారు.. ఇలా…సత్యవేడులో ఎంతమంది పెత్తనం చెలాయిస్తారు అంటూ ఫైర్ అయ్యారు ఆదిమూలం. అయితే.. ఆ ఫైర్ వెనక అసలు కథ వేరే ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది నియోజకవర్గంలో. నియోజకవర్గ టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్ రావడాన్ని సహించలేని వాళ్ళంతా దీని వెనక ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు.
Read Also: HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్ సెట్.. ఆ రెండు సీన్లు అదిరిపోతాయట..
ఇప్పటి వరకు గ్రూపులుగా విడిపోయిన వారంతా… ఇప్పుడు ఒక్కటై ఎమ్మెల్యేతో కలిసి.. ఆయన నోటితో ఈ మాటలను పలికించారన్న ప్రచారం జరుగుతోంది. అదొక కారణం అయితే… మరొకటి కొడుకు భవిష్యత్తు కోసం కూడా అయి ఉండవచ్చంటున్నారు. కొత్త కో ఆర్డినేటర్‌గా వచ్చీ రాగానే… శంకర్ రెడ్డి స్థానికంగా జరుగుతున్న ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమ రవాణాను పూర్తిగా నిలిపివేయించారట. వైఎస్ కుటుంబ మూలాలున్న పులివెందులకు చెందిన కొందరు ఇక్కడ చాలాకాలంగా ఇసుక దందా చేస్తున్నారని, అదే ఇప్పటికీ జరుగుతోందని గుర్తించిన శంకర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు కొత్త ఇన్ఛార్జ్ అంతా టైట్ చేశాక ఎమ్మెల్యేతో పాటు ఇతరగ్రూపుల నేతలకు నెల నెలా వచ్చే మామూళ్లు కూడా ఆగిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఒక్క ఇసుక మామూళ్ళ రూపంలోనే… ఎమ్మెల్యేకి నెలకు 15లక్షలు ముడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇసుక దందాతో నాకు సంబంధం లేదని పైకి చెబుతున్నా… ఆయన తీసుకునే లెక్క తీసుకుంటూనే ఉన్నారన్నది లోకల్ టాక్. ఇతర నేతలకు కూడా ప్రధాన ఆదాయ వనరు ఇదే కావడం, అది కూడా ఆగిపోవడంతో… అంతా కలిసి ఎమ్మెల్యే ఆదిమూలంను ముందుపెట్టి మాట్లాడించి ఉండవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఆదాయం ఒక ఎత్తయితే… తన కొడుకు సుమన్‌ను సైతం… పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోకపోవడంతో అతని రాజకీయ భవిష్యత్తు కోసం కూడా ఆదిమూలం స్వరం పెంచి ఉండవచ్చంటున్నారు. అందుకే ఆయన శంకర్ రెడ్డితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటూనే… కొడుకునైనా పట్టించుకోవాలి కదా అంటూ ఫైర్ అయినట్టు చెప్పుకుంటున్నారు.
అయితే సత్యవేడు టీడీపీ కార్యకర్తలు మాత్రం… ఈ పరిణామాలతో ఖుషీగా ఉన్నారట. గ్రూపు నేతలు పోతే పోనివ్వండి… నియోజకవర్గం బాగుపడుతుందని అంటున్నట్టు తెలిసింది.