హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ.
నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ.
ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు.
వరదల కారణంగా నేడు అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి గాయాలు.
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి. రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన. నేడు తెలంగాణలోని 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు.
హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,480 లుగా ఉండగా..22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.93,040 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,14,000 లుగా ఉంది.
నంద్యాల: నేడు నందికొట్కూరులో సీఎం చంద్రబాబు పర్యటన. హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు. మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం. నీటి విడుదల అనంతరం రైతులతో సమావేశంకానున్న సీఎం.
ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసే అవకాశం. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్.
HYD: సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష. సమీక్షకు హాజరుకానున్న మంత్రులు, అధికారులు.
నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై మాట్లాడే అవకాశం.
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. తాడేపల్లి డీఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపు. నేడు డీఎంఏ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్.