JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర సందర్భంగా పెద్దపప్పూరులో అతడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. నువ్వు మా ఊరికి వచ్చి నా గురించి మాట్లాడావు.. నేను మీ ఊరికి వచ్చి మాట్లాడలేనా అనుకుంటున్నావా? అంటూ మండిపడ్డారు.
Read Also: Vijayawada: పబ్లో పోలీసుల మెరుపు దాడి.. బిల్లు కట్టకుండా పరారైన 150 మంది!
ఇక, రప్పా రప్పా, రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు (బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) తెలుస్తుంది అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు.. నీకంటే బండ బూతులు మాట్లాడడం నాకు వస్తుంది.. నీ స్టైల్ ఏంటో తెలుసు.. నీలాంటి వాళ్లని ఎంతో మందిని చూశాను.. నా గడ్డం, నా నెత్తి సరిపోదు పోల్చడానికి అన్నారు. అలాగే, నువ్వు ఇవ్వన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది.. నువ్వు యువకుడివి నీకు చాలా భవిష్యత్తు ఉందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.