JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ ప్రెస్ మీట్‌లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలు మరువ లేకుండా ఉన్నారని, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే సమస్యే లేదన్నారు. పెద్దారెడ్డి విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని, తనతో ప్యాక్షన్ చేస్తానని సవాలు విసిరిన వ్యక్తిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే ప్రజలే కొడతారని, మహిళలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి జైల్ కు పంపిన చరిత్ర పెద్దారెడ్డిది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడిన పెద్దారెడ్డి తాము అధికారంలో ఉన్నంతవరకు తాడిపత్రిలో అడుగు పెట్టనీయమని పేర్కొన్నారు. ఏది ఏమైనా.. పెద్దారెడ్డి విషయంలో నేను తగ్గను అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి..
Read Also: YS Jagan: హిందీపై తేల్చేసిన జగన్.. భాష నేర్చుకోవడంలో తప్పు లేదు.. కానీ..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎలా మా ఇంటికి వచ్చాడు.? అని ప్రశ్నించారు జేసీ.. మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఆయన కూడా ప్రత్యర్థుల ఇళ్లలోకి వెళ్లలేదే..? అని ప్రశ్నించారు.. మీ తాత చనిపోయిన రోజు పులివెందుల మధ్యాహ్నం వరకు బాగుంది.. ఈ కేతిరెడ్డి ఫామిలీ పులివెందులలోకి వెళ్లి బీఎన్ రెడ్డి ఇల్లు కాల్చారన్నారు.. జగన్ రెడ్డి.. నీకు గుర్తు లేకపోతే మీ అమ్మని అడుగు అని సూచించారు.. ఇక, నా పైన ఉన్నన్ని కేసులు ఎవరిపై ఉండవు, అయినా నేను బాధపడలేదన్నారు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంతింటికి వెళ్లలేడా అని ప్రశ్నిస్తున్నావు..? అసలు కేతిరెడ్డి నివాసముంటున్నది సొంత ఇల్లు కాదు, మూడు సెంట్లు మున్సిపాలిటీ స్థలం ఆక్రమించి నిర్మించాడన్నారు.. నన్ను జైలుకు పంపించినా నేను సంతోషంగా వెళ్లాను, నా కొడుకుని కూడా జైలుకు పంపించారు. నా భార్య మీద 12 కేసులు, నా కోడలు మీద మూడు కేసులు ఉన్నాయి. ఏదేమైనా.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే సమస్యే లేదని స్పష్టం చేశారు.. పెద్దారెడ్డి విషయంలో ఎంత దూరమైనా వెళ్తా.. తాడిపత్రి లోకి వస్తే ప్రజలే కొడతారని హెచ్చరించారు..
Read Also: The Girlfriend: ‘నదివే’ అంటూ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రష్మిక, దీక్షిత్ శెట్టి..!
ఇక, ప్రసన్న కుమార్ రెడ్డి అక్క అయిన నా భార్యను మా ఇంటిలోకి వచ్చి అనరాని మాటలు అన్న పెద్దారెడ్డిని ఎలా సమర్థిస్తున్నావు అని ప్రశ్నించారు జేసీ.. ప్రసన్నను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అని అంటున్నావు.. మొత్తం మా కుటుంబం 40 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్నారు.. పెద్దారెడ్డి విషయంలో నేను తగ్గను.. అంటే తగ్గను అన్నారు.. పెద్దారెడ్డి పైన సారా అమ్మిన కేసు ఉంది, అలాంటి వాడిని పార్టీలో పెట్టుకుంటావా.. పోలీసులు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు… వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ ఉందా..? అని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి..