జగన్.. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్ల ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. " సీఎం హోదాలో తాను తీసుకున్న ఫర్నిచరును జగన్ తిరిగి అప్పగించ లేదు.
నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత విద్యా శాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీయే సర్కార్ కసరత్తు చేస్తుంది.