రాష్ట్రానికి మంత్రి అయినా అనంతపురం జిల్లాకు కూలీగా పని చేస్తానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న పయ్యావుల కేశవ్కు సోమవారం మండలంలోని బాట సుంకులమ్మ ఆలయ సమీపంలో ఘన స్వాగతం లభించింది.
పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు.
ప్రజలు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పరిపాలన దక్షుడు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కటం అదృష్టమన్నారు.
రాష్ట్రంలో రుషికొండ భవనాల వివాదం నడుస్తోంది. ఆ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం ఆ భవాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియా, మీడియా ఛానెల్ లలో వైరల్ గా మారాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజార్టీ సాధించిన కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కారు. కాగా.. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల ఇళ్లపై కూటమి పార్టీల కార్యకర్తలు ఎగబడుతున్నారు.