కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్డీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి దీనిపై ఓ లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. లేఖ విడుదల చేయడంతో పాటు.. ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు కర్రి వెంకట రామారెడ్డి.
బెజవాడ రాజకీయలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు.. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు బెజవాడ మాజీ ఎంపీ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.
లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునః ప్రారంభిస్తాం... అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. వరుసగా మూడోసారి గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు..
AP Cabinet Meeting: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఏపీ మంత్రివర్గం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు…
వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఉండేలా కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఎక్కువగా స్థానాలను కైవసం చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని నాల్గవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అంతే కాకుండా లోకసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరువాత అతి పెద్ద పార్టీగా అవతరించింది టీడీపీ పార్టీ . కానీ కేబినెట్ సీటుపై పూర్తిగా దృష్టి సారించలేకపోయారు. ఎవరు మంత్రులు అవుతారనే చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలలో మరో చర్చ కూడా నడుస్తోంది. గడచిన ఐదేళ్లలో పార్టీ కోసం పని చేసిన వారికి పెద్దపీట వేస్తారా లేక కేసులు ఎదుర్కొన్న, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యం…