Gudivada Amarnath: ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అవి వైఎస్ జగన్ సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. రుషికొండ భావనలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని కోరారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం.. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భావనలను వినియోగించుకోవాలని సూచించారు.. రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఏమీ ఉండరు అని వ్యాఖ్యానించారు.
Read Also: Home Minister Anitha: లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదు..
ఇక, విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు.. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని తెలిపారు అమర్నాథ్.. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటంబం మీద బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం? అని మండిపడ్డారు..2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. హైదారాబాద్ లో ఇల్లు నిర్మించుకునే సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్ ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండ పై శాశ్వత భవనాలు నిర్మించారని తెలిపారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలని సవాల్ చేశారు.. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవుపలికారు.
Read Also: Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
రుషికొండ పై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలని కోరారు గుడివాడ అమర్నాథ్.. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదన్న ఆయన.. గతంలో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు పెట్టగా లేని అభ్యంతరం ఈ భావనాలకు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్‌లో స్టార్ హోటల్ లో ఉంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది మర్చిపోయారా? అని నిలదీశారు. విశాఖ రాజధానిని స్వాగతించిన గంటాకు నగరంలో ఒక్క ప్రభుత్వ అతిధి గృహం కూడా లేదన్న విషయం తెలియదా? స్థానిక శాసనసభ్యుడిగా రుషికొండ ఎదురుగా 25 ఎకరాలు ఆక్రమించుకున్న గీతం యూనివర్సిటీకి గంటా ఎందుకు తీసుకెళ్లలేదు.. ప్రభుత్వంపై ఆరునెలలు విమర్శలు చేయకూడదని అనుకున్నా టీడీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక, కోడెల శివప్రసాద్ సామాగ్రి తరలింపునకు, మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయ సామాగ్రికి పోలికే లేదన్నారు. ముఖ్యమంత్రిగా నివాసం ఉన్నారు కాబట్టి ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, ఫర్నిచర్ కు డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖ రాశాం అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..