Dola Sree Bala Veeranjaneya Swamy: రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తాం
- బలవంతంగా మాతో రాజీనామాలు చేయించారని వాలంటీర్ల ఆవేదన
- ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని మంత్రి వీరాంజనేయ స్వామి హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పరిపాలన దక్షుడు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కటం అదృష్టమన్నారు.బాద్యతలు తీసుకున్న వెంటనే సీఎం హామీల అమలు మొదలు పెట్టారన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మాది విడతల వారీ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమన్నారు. ఐదు రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని తెలిపారు. తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని..రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. త్వరలో అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టబోతున్నామని స్పష్టం చేశారు.
READ MORE: BJP: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో బీజేపీ నేతల సీక్రెట్ సమావేశం..ఎజెండా ఏంటి?
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీ నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు. జిల్లాలో మైనింగ్ కు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎస్సీ కాలనీల్లో మూతబడిన పాఠశాలలు తెరిపిస్తామన్నారు. తమకు సచివాలయాలు, వాలంటీర్ల శాఖ ప్రకటించిన సమయం నుంచి నా మెయిల్లు, వాట్సాప్ లు నిండిపోయాయని తెలిపారు. బలవంతంగా మాతో రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన పెన్షన్లను ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు.
READ MORE:Amit Shah: త్వరలో.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్..!
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. తన టీమ్‌ను సైతం సిద్ధం చేసుకున్నారు. మంత్రులకు సైతం శాఖలు కేటాయించారు. అయితే మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపులో.. వాలంటీర్లకు టీడీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. 24 మందికి శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖను ఏర్పాటు చేసి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి అప్పగించారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!