ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికైయ్యారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రొటెం స్పీకర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు.
గృహానిర్మాణాలు సకాలంలో పూర్తి చేయటానికి కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తేదీన తుది గడువుని పేర్కొంది.
టీడీపీ గతంలో చాలా కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొందని, నిద్ర లేని రాత్రులు గడిపామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ నేతలు మాట్లాడలేకపోయేవారని గుర్తు చేసుకున్నారు.