ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్.. జ్యూరిక్లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు..
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు కేంద్రం 11,500 కోట్ల రూపాయల సహాయం అందించిందని, ఒక్కరోజు విశాఖపట్నం పర్యటనలో ప్రధాన నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రెండు లక్షల కోట్ల నిధులు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించడమే అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..
ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలని కూడా వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నా అని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను స్వాగతిస్తానన్నారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని, వర్మ లేదా ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని పేర్కొన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దానికి ప్రాధాన్యం…
టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణలు కొలికపూడి నుంచి వివరణ తీసుకున్నారు. ఇటీవల జరిగిన వరస సంఘటనలపై ఎమ్మెల్యేను క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని, గిరిజన మహిళ విషయంలో కేసు కూడా నమోదు కాలేదని కొలికపూడి…
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్ పేరుతో దావోస్‌లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్,…
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. మొదటి రోజు స్విట్జర్లాండ్‌లో భారత్ హైకమిషనర్‌తో భేటీ. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. ఎన్నారైలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం బృందం. దావోస్ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు. ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. సింగపూర్ నుంచి దావోస్‌కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి.…
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. 'సీఎం సర్.. ఆల్ ది బెస్ట్' అంటూ విష్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…
సీఎం చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని.. అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు. బ్రాండ్ ఏపీ పేరుతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం ప్రయత్నం చేయనున్నారు. మొదటిరోజు జ్యూరిచ్‌లో 10 మంది పారిశ్రామికవేత్తలతో…