నేడు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎంపీలు పార్లమెంట్లో తమ స్వరం వినిపించాలని చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు తేవడంపై దృష్టి పెట్టాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలు రావాలన్నారు సీఎం. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ఆర్ధిక పరిస్థితిపై అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి…
2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని పార్టీ ముఖ్య నాయకులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సూచించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని, పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం పేర్కొన్నారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లతో…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన…
కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సాగుతున్న చర్చపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై బుచ్చయ్య చౌదరి స్పందించారు.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరికి ఆలోచన లేదన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారని అన్నారు..
ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
BC Janardhan Reddy: గతంలో మన రోడ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూశారు అని రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాలు జోకులు కూడా వేశాయని పేర్కొన్నారు. మొత్తం రూ. 3, 014 కోట్లుతో పనులు చేస్తున్నాం.. రూ. 94 కోట్లు ఏలూరు జిల్లాకు కేటాయించాం అన్నారు.
Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతున్నామని చెప్పేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత విధ్వంసం చేశాడని చంద్రబాబు ఉహించలేదంట.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు.. అందుకే సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
CM Chandrababu: నీతి అయోగ్ రిపోర్టుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటాం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం..