Smriti Mandhana: ప్రేమ విఫలమైనా.. ఆటలో మాత్రం తగ్గేదేలే! ఆర్సీబీకి కప్పు.. ఆసీస్‌పై సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: సాధారణంగా బ్రేకప్ జరిగిన తర్వాత లవర్స్ ఏం చేస్తారు. బాగా బాధ పడతారు! ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల టైమ్ పడుతుంది. కొందరు సున్నిత మనసున్న అమ్మాయిలు, అబ్బాయిలు అఘాయిత్యాలకు పాల్పడుతారు. తాగుతూ జీవితం ఇక్కడితో అయిపోయిందని భావిస్తారు. కానీ.. కొందరు మాత్రం స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారు. ఈ కమ్‌బ్యాక్ చూసిన తర్వాత తనను వదిలేసిన అమ్మాలి లేదా అబ్బాయి కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేస్తారు. అచ్చం లాంటి ఘటనే తాజాగా క్రికెట్ ప్రపంచంలో చోటు చేసుకుంది. బ్రేకప్ తర్వత ఎలాంటి అసహనానికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్తోంది టీమిండియా ఉమెన్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన. ఇటీవల తన అద్భుతన ప్రదర్శనతో మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయానికి చేరువ చేసింది. ఎలాంటి భయం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ మహిళల జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మంధాన పాత్ర అసాధారణం. ఆమె బ్యాట్ పట్టినప్పటి నుంచి మ్యాచ్ మీద ఆర్సీబీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కేవలం 41 బంతుల్లో 87 పరుగులు చేసి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానకు ఇది మామూలు మ్యాచ్ కాదు.. బ్రేకప్ తర్వాత స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అనే చెప్పాలి.
READ MORE: Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవ.. కొణిదెల గ్రామానికి మహర్దశ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇదిలా ఉండగా.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై భారత లేడీ సింగం స్మృతి మంధాన మరోసారి గర్జించింది. కంగారూ సొంత గడ్డలో ఆ టీమ్‌ను 17 పరుగుల తేడాతో ఓడించారు. టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బాధ్యతాయుతంగా ఆడి కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు స్కోర్ చేసి జట్టును నిలబెట్టింది. 149.09 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి ఆ తర్వాత గేర్ మార్చింది మంధాన.. మెంబర్స్ స్టాండ్‌లోకి కొట్టిన ఓ భారీ సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. పేసర్ డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. తన 160వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆమెకు ఇది 33వ అర్ధశతకం. ఇలా కీలక మ్యాచ్‌లలో స్మృతి మంధాన ఆడుతున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
READ MORE: India vs Australia: ఆసీస్ గడ్డపై గర్జించిన భారత మహిళలు.. పదేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!