Nimmala Ramanaidu: గత విధ్వంస పాలనకు నిదర్శనం ఇరిగేషన్ ప్రాజెక్టులే అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 17 నెలల పాటు పోలవరం ఆలన పాలన లేకుండా చేశారు.. పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచీ నాలుగు వేల క్యూసెక్కులు అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని సీఎం అన్నారు.. పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి ఒక రివ్యూ చేశాం.. ఏ పని ఏ నెలలో పూర్తి చేయగలరో ఏజెన్సీలకు లక్ష్యం నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధీ లేని పాలన గత వైసీపీ పాలన.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరల నిర్మించడం మా లక్ష్యం.. ప్రతీ పనిని వెబ్ సైట్ లో పెట్టి రివ్యూ చేస్తామని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
Read Also: Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
ఇక, ఏపీ సాగునీటి వ్యవస్ధకు మాజీ సీఎం జగన్ అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎత్తు గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు.. పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ కి లేదన్నారు. డిసెంబర్ లో గైడ్ వాల్స్ పూర్తి చేస్తాం.. మొదటి కట్టర్ పని చేస్తోంది.. రెండో కట్టర్ మూడో కట్టర్ కూడా మార్చి నాటికి పనిలో ఉంటాయి.. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం ను 2026 లో ప్రారంభించి 2027 నాటికి పూర్తి చేస్తాం.. ట్రిపుల్ ఇంజన్ (చంద్రబాబు, పవన్, మోడీ) సర్కార్ ఉంటే ఉపయోగం మనం చూస్తున్నాం.. హంద్రీనివా ను 2500 కోట్లు ఆర్ధిక క్లిష్ట పరిస్ధితుల్లో తీసుకొచ్చి పని చేస్తున్నాం.. చింతలపూడి రివ్యూ చేస్తుంటే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.. కృష్ణ-గోదావరి జలాల పంపిణీ విషయంలోనూ ద్రోహం జరిగింది.. 2023లో కృష్ణా- గోదావరి జలాల పంపిణీ రివ్యూ చేసే అధికారం కేంద్రం ఇస్తే ఎందుకు మొద్దు నిద్ర పోయారు అని మంత్రి నిమ్మల వెల్లడించారు.