Vasantha Krishna Prasad: ఏపీలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని, బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెట్టర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పనీ పాటా లేని విమర్శలుగా కొట్టిపారేశారు.. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీరుతో భయపడుతున్నారని ఆరోపించారు.
Read Also: AP High Court: నిబంధనలు పాటించలేదు..! డీజీపీ ఎంపికపై హైకోర్టులో పిటిషన్..
ఇక, వైసీపీలో రెండవ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఆకస్మికంగా ఆ పార్టీని వదిలి వెళ్ళారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సూచించారు వసంత కృష్ణప్రసాద్.. వైఎస్ రాజశేఖరరెడ్డికి రామచంద్రరావు ఆత్మ అయితే, జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఆత్మగా అభివర్ణించిన ఆయన.. భవిష్యత్ లో చాలా మంది వైసీపీని వీడతారు, 3 నెలల్లో మిగిలిన లీడర్లు కూడా ఆ పార్టీ నుండి బయటకు వస్తారు అని జోస్యం చెప్పారు.. మునిగిపోయే పడవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే ఇక్కడ వద్దని వేరే జిల్లాలకు పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, అబివృద్ది రెండు కళ్లుగా ముందుకెళ్ళాలంటే కూటమి ప్రభుత్వానికే సాధ్యం అన్నారు.. ఇక, లోకేష్ డిప్యూటీ సీఎం అనేది సోషల్ మీడియా దుమారం, ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం నుండి ఆదేశాలు ఉన్నాయని.. అటువంటి నిర్ణయం ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.