నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. గతంలో తనకు న్యాయం జరగదు అనే భావం ఉండేదని.. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. “పీవీ సునీల్ కుమార్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా? వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది.. లేదంటే , సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ఎందుకు దర్యాప్తునకు పిలవడం లేదో అన్న అనుమానం ఉంది.. ఈ కేసులో ఇప్పటివరకు ఏ1, ఏ 2 లకు నోటీసులు ఇవ్వలేదు. సస్పెన్షన్ చేయలేదు.. సర్వీసు రూల్స్ ప్రకారం.. అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వాళ్ళనీ సస్పెన్షన్ చేయాలి.. కానీ ఎందుకు సస్పెండ్ చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు.. విజయ పాల్ కు గతం గుర్తుకు రావడం లేదంట, సడన్గా వయసు అయిపోయింది అని చెప్తున్నారు.. భవిష్యత్తులో, నిందితులకు శిక్ష పడుతుందని, నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను..” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: AP Film Chamber of Commerce: ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా..