ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి జెండా పట్టాలో.. ఎవరి సైకిల్ ఎక్కాలో కేడర్‌కు అర్థం కాని పరిస్థితి. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు మాత్రం బస్తీమే సవాల్ అని గ్రూపులు కట్టి కొట్టుకుంటున్నారు. అధిష్ఠానం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా.. అక్కడి లెక్కలు తేల్చకుండా కాలక్షేపం చేస్తున్నట్టు తమ్ముళ్ల అనుమానం. అసలు ఆ నియోజకవర్గంలో ఎందుకు అంత గందరగోళం? హైకమాండ్ లెక్కలేంటి? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన…
కృష్ణా జిల్లా ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ హాట్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. తాజాగా నూజివీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల హౌస్ అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. అభివృద్ధికి మేము కారణం అంటే.. మేము కారణం అంటూ ఇరు రాజకీయపార్టీలు సవాళ్లు విసురుకోవడంతో ముందస్తు చర్యగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సవాళ్ళతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ…
అక్కడ టీడీపీ లీడర్లకు కొదవ లేదు. కానీ.. వారిపై కేడర్‌కే క్లారిటీ లేదు. ఎవరు పార్టీని లీడ్ చేస్తారో.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థెవరో తెలియక సతమతం చెందుతున్నారట. ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేక అయోమయంలో ఉన్నారట తమ్ముళ్లు. కావలిలో టీడీపీ కేడర్‌కు దిశానిర్దేశం లేదా?ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కావలి. అలాంటిచోట సైకిల్ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. బీద మస్తానరావు పార్టీని వీడి వెళ్లాక…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోంది గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి గాల్లోకి విసిరేశారు టీడీపీ సభ్యులు.
బిజినెస్ ముఖ్యమా? పార్టీ ముఖ్యమా? ప్రస్తుతం టీడీపీలో ఇదే చర్చ. కొంతమంది నేతలు బిజినెస్సే ముఖ్యమనే రీతిలో వ్యవహరిస్తూ… కుదిరిన సమయంలో మాత్రమే వస్తున్నారు. ఇంకొందరు వ్యాపారాల కోసమే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా బిజినెస్ పొలిటీషియన్స్? వ్యాపారాల కోసం సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న టీడీపీ నేతలు?ఏపీ టీడీపీలో బిజినెస్ పొలిటీషియన్స్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ అధికారం కోల్పోయిన తొలినాళ్లలో టీడీపీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా లేకున్నా.. కొంచెం నిరాశ నిస్పృహల్లో…
తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం యమరంజుగా వుంటుంది. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారు సత్యనారాయణ ఒక బడుద్ధాయి అనేశారు రాజా. టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని విప్ దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో తెలుదేశం పార్టీకి తాడు…
ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్‌లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా…
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా? ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరంగుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం…
రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధినులపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న తీరుపై సీఎం జగన్ కి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని లేఖలో…