Cyclone Montha: మొంథా తుఫాన్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. సహాయక చర్యల కోసం రెడీగా ఉండాలి అంటూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఉదయం మొంథా తుఫాన్ పరిస్థితులపై మంత్రులు. ఎమ్మెల్యేలు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. తుఫాన్ పరిస్థితి ఎదుర్కోవడానికి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. ఈ రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది..…
CM Chandrababu: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేతలకు దిశా నిర్దేశం చేశారు.. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు.. ప్రభుత్వం చేసే సంక్షేమం – అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుంది.. ప్రజలతో మమేకం కావడమే కాదు… ప్రజల్లో…
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. అనేక అంశాలపై స్పదించారు.. అన్నదాత సుఖీభవ, పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించిన ఆయన.. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు.. చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నాం.. గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నాం.. లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.. ఆర్థిక చేయూతను పెంచాం. ఈ నెలలోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలు నెరవేరుస్తున్నాం. రేపు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నాం.…
గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు.
కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. అభివృద్ధి, సంక్షేమం అంతా కార్యకర్త ద్వారానే జరగాలని ఆకాక్షించిన ఆయన.. ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలన్నారు.. ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు.. లేదా, ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను.. కుప్పంలోనే కాదు.. రాష్ట్ర…
జులై ప్రారంభం నుంచి జనంలోకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఈ విషయంలో ఇప్పటికే వారికి అధినేత నుంచి ఆదేశాలు అందాయి. అయితే... టీడీపీ నేతలను ఓ డౌట్ బాగా వేధిస్తోందట. అధినేత ఆదేశించినట్టుగానే జనంలోకి వెళ్తాం సరే. వెళ్లి ఏం జనానికి ఏం చెప్పాలి..? సూపర్ సిక్స్‌లో పెండింగ్‌లో ఉన్న పథకాల గురించి జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఎలా కన్విన్స్ చేయాలి..? అని లోలోపల మధనపడిపోతున్నారట.
Butchaiah Chowdary: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు తన ఘనత అని సిటీ ఎమ్మెల్యే వాసు ప్రకటించుకోవడాన్ని గోరంట్ల తప్పుపట్టారు. 1985లోనే ఎన్టీఆర్ స్వయంగా ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు ప్రణాళికలు రచించారని, ఆ సమయంలో భూముల కేటాయింపులో తానూ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాను వేసిన కృషిని గుర్తు చేస్తూ, రాష్ట్ర…
స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న పనిచేశారని పేర్కొన్నారు.
తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొందరు టీడీపీ నాయకుల పరిస్థితి న ఘర్ కా... న ఘాట్ కా అన్నట్టు తయారైందట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా పవర్‌లోకి తీసుకు రావాలంటూ... పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటూ... ఉన్న ఊళ్ళను, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి వచ్చారట కొందరు. పార్టీ పవర్‌లోకి వచ్చి ఆరునెలలైనా... ఎలాంటి అవకాశాలు దక్కక అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్నారట. జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నారైలు.... విదేశాల్లో ఉద్యోగాలను వదులుకొని ఇక్కడికి రాగా.... ఓ జిల్లా స్థాయి…