రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. బద్ధ శత్రువులు కూడా మిత్రులై పోతారు. ఆప్త మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. అందుకే శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రాజకీయాలకు పనికిరాదంటారు. అమరావతిలో ప్రారంభమయిన రైతుల మహాపాదయాత్ర సందర్భంగా అరుదైన సంఘటన జరిగింది. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి వైసీపీయేతర పార్టీలు. మాజీకేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రేణుకా చౌదరికి స్వాగతం పలికేందుకు, హారతి పట్టేందుకు మూలపాడులో కాంగ్రెస్ మహిళా…
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తినను తాకింది.. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఆయన.. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను ఏకరువు పెట్టింది.. నాలుగు ప్రధాన అంశాలను ప్రెసిడెంట్ ముందు పెట్టారు.. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేసింది చంద్రబాబు టీమ్.. లిక్కర్, డ్రగ్స్, మైనింగ్, సాండ్ మాఫియా విస్తరించిందని.. న్యాయ, మీడియాతో సహా అన్ని వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆయన…
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల…
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీడీపీ నేతలపైనే కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు.. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. ఈ కేసులో.. ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి…
వారం రోజులుగా టీడీపీలో బాలయ్య హాట్ టాపిక్. ఆయన తీరు లాభమో.. నష్టమో.. తేల్చుకోలేకపోతున్నారట తమ్ముళ్లు. సున్నితమైన విషయాల్లో బాలయ్య టచ్ మీ నాట్‌గా ఉండాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఏ విషయంలో పార్టీ ఆందోళన చెందుతోంది? లెట్స్ వాచ్..! బాలయ్య వల్ల ఎదురయ్యే కష్టాలపై టీడీపీలో ఆరా? మా ఎన్నికలకు ముందు.. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎంత చర్చకు దారి తీశాయో.. దాదాపు అంతే చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతోంది. మా ఎన్నికల్లో…
రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుప్తె సీమ నేతల సదస్సులో కీలక తీర్మానం చేసారు. అయితే కృష్ణానదీ యాజమాన్య బోర్డు తొలిదశలో తీసుకోబోతున్న 15 నీటి ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల లేకపోవడం అన్యాయం అన్నారు. కర్ణాటక నుండి కృష్ణా జలాలు జూరాల నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాలి. కీలక ప్రాజెక్టు కృష్ణాబోర్డు ఆధీనంలో లేకపోతే పక్క రాష్ట్రం అనధికారిక నీటివినియోగానికి పాల్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే జూరాలను బోర్డు పరిధిలోకి చేర్చాలని ఈ…
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తెలుగు తమ్ముళ్లు వరుసగా ఆహ్వానాలు పంపుతున్నారు. తమ జిల్లాల్లో పర్యటనలు చేయాలని కోరుతున్నారట. దీనికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ జిల్లా పర్యటనలకు వస్తానని వారందరికీ అభయం ఇస్తున్నారట. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ టీడీపీలోనే జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ ను టీడీపీ నేతలు మచ్చిక చేసుకుని సీటును…
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెరాయిన్ కు ఏపీకి ఎలాంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బట్ట కాల్చి మీద వేయటం టీడీపీ అలవాటే అని చెప్పిన ఆయన టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నాడు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రెస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు.…
ఆ జిల్లాలో వారి బాధను టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. వరస ఓటములతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నా వినేవాళ్లే లేరట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబును మించిన ఆవేదనలో టీడీపీ తమ్ముళ్లు..! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే గెలిచారు. మిగిలినచోట్ల వైసీపీదే విజయం. అది మొదలు.. పంచాయతీ,…
మరోసారి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. నిన్న చంద్రబాబు నివాసం దగ్గర హల్‌చల్ చేసి అరెస్ట్ అయిన ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్‌ను, మంత్రులను అసభ్యంగా తిట్టడం వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలపటానికి వెళ్తే నాపై దాడి చేశారని మండిపడ్డారు.. కాల్ మనీ సెక్స్…