ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు. అశోక్ బాబును అరెస్టు చేసి ఏం విచారణ చేశారు.రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలి.పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలి.లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం.ప్రజలకు…
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలు చాలా సీరియస్ గా వున్నారు. గుడివాడ కేసినో పై చంద్రబాబుకి నివేదిక అందచేశారు. గుడివాడలో కేసినో నిర్వహణపై రూపొందించి సమగ్ర నివేదికను గవర్నరుకి అందచేస్తాం. గవర్నర్ రేపు, ఎల్లుండిలో సమయమిస్తే ఆయనకు క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తాం అన్నారు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర. క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు…
ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్టూరులో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏర్పాటు చేశారు. సంతమాగులూరు మండలం వెల్లలచెరువలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. సింగరాయకొండలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పాల్గొన్నారు. Read Also:నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో.. కరోనా బారినపడ్డ…
సినిమా టికెట్ల ధరల విషయంలో ఆ ఎమ్మెల్యే సొంతపార్టీ హీరోనూ బుక్ చేశారా? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో పార్టీ ఉండగా.. ఆయన కామెంట్స్ టీడీపీ శిబిరాన్నే ఇరుకున పెట్టేలా ఉన్నాయా? తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సినిమా టికెట్ ధరలపై టీడీపీ నేతల ఆసక్తికర కామెంట్స్‌సినిమా టిక్కెట్ల వ్యవహారం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్. టిక్కెట్ రేట్లు మొదలుకుని.. థియేటర్ల సీజ్ వరకు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన…
రాజ్యాధికారం దిశగా కాపు సామాజికవర్గం యాక్టివ్ కావడం టీడీపీలో గుబులు రేపుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లే కీలకమని లెక్కలేసుకుంటున్న తరుణంలో.. కొత్త పరిణామాలు టీడీపీని కలవర పెడుతున్నాయా? విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీసీల తిరిగి దగ్గరయ్యారనే అంచనాల్లో టీడీపీఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని లెక్కలేస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీసీ,…
ఆ జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే. కాకపోతే.. ఒకరంటే ఇంకొకరికి పడదు. పైకి నవ్వుతారు.. తెరవెనక కత్తులు దూసుకుంటారు. ఎప్పుడు కలిసి పోతారో తెలియదు.. ఎందుకు విడిపోతారో కూడా గుర్తించలేం. ప్రస్తుతం ఆ జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆసక్తికర వార్ జరుగుతోంది. అదే పార్టీలో పెద్ద చర్చ…రచ్చ..! పార్టీని బలహీనపర్చడానికే నేతలు కష్టపడుతున్నారా? టీడీపీలో క్రమశిక్షణ కనుమరుగవుతోందా? ఒక్క సీటూ గెలవలేని జిల్లాలో ఎవరేం చేసినా అధిష్ఠానానికి…
ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే కర్నూలు మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులపై దాడిపై ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు చేసారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బేతాలలో కేఈ ప్రభాకర్, కోట్ల సుజాత, గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, తిక్కా రెడ్డి ఉన్నారు. అయితే టీడీపీ నేత తిక్కారెడ్డి పై మూడు సార్లు దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అక్రమాలను అరాచకాలను అడ్డుకుంటున్నందుకే తమ పై దాడి…
చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని నర్సీపట్నం టీడీపీ నేత అయ్యపాత్రుడు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నా కాస్తా పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్…
అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ ఏపీకి సీఎం అయ్యింది చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడానికే అని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఒకపక్క రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రజలు కొట్టుకుపోతుంటే మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదని ఆరోపించారు. చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపమని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయాలు బయటకు వస్తాయనే ఇలా తిట్టిస్తున్నారని.. ఇంకోసారి తమ నాయకుడి గురించి మాట్లాడితే…