తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం యమరంజుగా వుంటుంది. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారు సత్యనారాయణ ఒక బడుద్ధాయి అనేశారు రాజా.
టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని విప్ దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో తెలుదేశం పార్టీకి తాడు బొంగరం లేదు. టీడీపీ లో బండారు లాంటి లుచ్చా నాయకులే ఉన్నారు. అకాల మరణం చెందిన వివాద రహితుడైన గౌతమ్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయదానికి నీకు సిగ్గు లేదా..? అని ప్రశ్నించారు విప్ దాడిశెట్టి రాజా. బండారు నిన్ను ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా..?యనమలకి తునిలో సత్తా లేకే పక్క జిల్లాలోని పత్తాలేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నాడని మండిపడ్డారు. యనమల ఒక ముసలోడు ఆ ముసలోడు యువత కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం పెట్టుబడుల గురించి వత్తిడి తేవడం వల్లే మంత్రి గౌతమ్ రెడ్డి గుండెనొప్పికి గురయ్యారని, దీనిపై విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయడంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.