మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీడీపీ నేతలపైనే కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు.. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. ఈ కేసులో.. ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రవణ్ పేర్లను చేర్చారు.. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.